: చంద్రబాబు నోట మరోమారు ‘సాక్షి’ ప్రస్తావన!
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబం ఆధ్వర్యంలోని ‘సాక్షి’ దినపత్రిక పేరును మరోమారు ప్రస్తావించారు. అవకాశం చిక్కినప్పుడల్లా ఆ పత్రికపై నిప్పులు చెరుగుతున్న చంద్రబాబు... ఈ దఫా అలాంటి కామెంట్లేమీ చేయలేదు. పుష్కర ఏర్పాట్లపై నిన్న విజయవాడలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన జగన్ పత్రిక పేరును ప్రస్తావించారు. పుష్కర ఏర్పాట్లకు సంబంధించి జనం సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్న ఆయన... ఏర్పాట్లపై ‘సాక్షి’ పత్రిక కూడా వ్యతిరేక కథనాలు రాయలేకపోతోందని చెప్పారు. వెరసి పుష్కరాల ఏర్పాట్లపై జగన్ పత్రిక కూడా సంతృప్తి వ్యక్తం చేసినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు.