: చర్చలతో సాధ్యం కానిదేదీ లేదు...రెచ్చగొట్టుకోవడం వద్దు: డిగ్గీ రాజా


చర్చలతో సాధ్యం కానిదేదీ లేదని ఏఐసీసీ కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన కాంగ్రెస్ రైతు సభలో ఆయన మాట్లాడుతూ, కాశ్మీర్ లోని పరిస్థితులను చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. వేర్పాటు వాదులతో చర్చలు జరపడం ద్వారా పరిస్థితులు చక్కబడతాయని ఆయన సూచించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యల ద్వారా సమస్యలు సమసిపోవని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో తక్షణం చర్చలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కవ్వింపు చర్యలు మానుకోవాలని ఆయన సూచించారు. కాశ్మీర్ లో శాంతి నెలకొనాలని ఆయన ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News