: అరుణ్ జైట్లీతో సుజనా చౌదరి భేటీ


కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీతో మరో కేంద్ర మంత్రి సుజనా చౌదరి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వివిధ అంశాలపై వీరు చర్చిస్తున్నారు. లోటు బడ్జెట్ పూరించడం, పాత బకాయిలు విడుదల చేయడం, ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలపై వీరు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, ఏపీకి ప్రత్యేకహోదా నిరాకరించి, ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని వార్తలు వెలువడుతున్న తరుణంలో ఇద్దరు కేంద్ర మంత్రుల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Loading...

More Telugu News