: నయీం నన్ను తప్పుకోమని బెదిరించాడు: సంచలన వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి


కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ నయీం తనను ఎన్నికల నుంచి తప్పుకోమని బెదిరించాడని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సభలో ఆయన మాట్లాడుతూ, తాను గతంలో ఎమ్మెల్సీగా పోటీలో నిలబడినప్పుడు పోటీలోంచి తప్పుకొమ్మని నయీం ఒత్తిడి చేశాడన్నారు. ఈ సందర్భంగా నయీం మనుషులు తనను బెదిరించారని ఆయన తెలిపారు. నయీం కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, నయీం అక్రమాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని సమాచారం. నయీం ఎన్ కౌంటర్ కావించబడ్డప్పటికీ, ఆ పాపాలుడు సంపాదించిన ఆస్తులు కాపాడుకునేందుకు వాడి అనుచరులు తీవ్రంగా ప్రయత్నిస్తారని, వారి నుంచి ప్రాణహాని ఉందని పలువురు వెనుకాడుతున్నట్టు తెలుస్తోంది. వారిని కూడా అదుపులోకి తీసుకుంటే మరింత మంది బయటకు వచ్చే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News