: తెలంగాణ ప్రభుత్వం మజ్లిస్‌కు తలొగ్గింది: బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు లక్ష్మణ్


తెలంగాణ ప్ర‌భుత్వంపై భార‌తీయ జ‌న‌తాపార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ విరుచుకుప‌డ్డారు. ఈరోజు క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. స‌ర్కారు మ‌జ్లిస్ పార్టీకి త‌లొగ్గింద‌ని వ్యాఖ్యానించారు. ఓటు బ్యాంకు కోస‌మే స‌ర్కారు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని ఆరోపించారు. గత ప్రభుత్వాలు క‌న‌బ‌ర్చిన తీరే టీఆర్ఎస్ ప్ర‌భుత్వం కూడా క‌న‌బ‌రుస్తోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేశారు. తాము రాష్ట్రంలో చేప‌ట్టిన‌ తిరంగ యాత్రతో ప్రజల్ని ఉత్తేజితుల్ని చేసి, రాష్ట్రం విమోచనా దినోత్సవం నిర్వ‌హించుకునేలా చేస్తామ‌ని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News