: తాతగారి ఫ్రెండ్ ను కాల్చిన బాలుడు... గురి తప్పిన బుల్లెట్... బెంగళూరులో కలకలం


తుపాకీ పేలుళ్లతో బెంగళూరులో కలకలం రేగింది. ఇస్రోలో పని చేసి రిటైర్ అయిన గోవిందప్ప తన స్నేహితుడు, బీజేపీ కౌన్సిలర్ మునిరాజును కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. మీటింగ్ హాల్లో కబుర్లు చెప్పుకున్న అనంతరం బట్టలు మార్చుకుని వస్తానని చెప్పిన మునిరాజు, జేబులో ఉన్న రివాల్వర్ ను తీసి స్నేహితుడి ముందు టేబుల్ పై పెట్టి లోపలికి వెళ్లారు. ఇంతలో మునిరాజు మనవడు ఆడుకుంటూ అటుగా వచ్చి, టేబుల్ పైనున్న ఆ రివాల్వర్ తీసుకుని గోవిందప్పకు గురిపెట్టి కాల్చాడు. అదృష్టవశాత్తూ ఆ తుపాకీ గుండు ఆయన మెడను రాసుకుంటూ వెళ్లిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఆయన స్వల్పగాయాలతో బయటపడ్డారు. అయితే తాను తుపాకీని లాక్ చేసి ఉంచానని, ఇలా ఎందుకు పేలిందో తనకు అర్థం కాలేదని మునిరాజు తెలిపారు. గోవిందప్పను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News