: పాకిస్థాన్‌ను నరకంగా అభివర్ణించిన మనోహర్ పారికర్
గిల్గిత్, బలూచిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని నిన్న ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు విదితమే. రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కూడా తాజాగా పాకిస్థాన్‌పై మండిపడ్డారు. ఆ దేశాన్ని నరకంగా ఆయన అభివర్ణించారు. నరకానికి వెళ్లడమన్నా, పాకిస్థాన్‌కి వెళ్లడమన్నా ఒకటేనని ఆయన వ్యాఖ్యానించారు. మన దేశానికి భారీ నష్టం చేయాలని చూస్తోన్న ఆ దేశ వ్యూహాలు బెడిసికొడుతున్నాయని, దీంతో ఆ దేశం భారత్‌ని ఏదోలా స్వల్పంగానయినా నష్టపరచాలని చూస్తోందని ఆయన విమర్శించారు .