: పునరావాస చర్యలు అమలయ్యేవరకు నిర్వాసితులను ఖాళీ చేయించొద్దు: హైకోర్టు ఆదేశం
తెలంగాణ సర్కారు అమలుచేస్తోన్న జీవో 123ని రద్దు చేసిన హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేసుకున్న సంగతి తెలిసిందే. హైకోర్టులో ఈ అంశంపై ఈరోజు మరోసారి విచారణ జరిగింది. అనంతరం హైకోర్టు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. పునరావాస జీవో 190లో స్వల్పమార్పులు చేసి తెలంగాణ ప్రభుత్వం న్యాయస్థానానికి సమర్పించింది. ప్రభుత్వం చూపిన జీవోలో పేర్కొన్న పునరావాస చర్యలు అమలయ్యేవరకు నిర్వాసితులను ఖాళీ చేయించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, నిమ్జ్ కోసం భూముల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లకు హైకోర్టు అనుమతినిచ్చింది.