: ఏం చేద్దాం?.. క‌శ్మీర్ ప‌రిస్థితిపై ఢిల్లీలో రాజ్‌నాథ్ సింగ్ కీల‌కభేటీ


హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ తర్వాత కశ్మీర్‌లో ఏర్ప‌డిన ఉద్రిక్త ప‌రిస్థితులు ఇంకా చ‌ల్లార‌లేదు. ఆందోళ‌న‌కారులు, భ‌ద్ర‌తాబ‌ల‌గాల‌కు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చెల‌రేగుతూనే ఉంది. మ‌రోవైపు ఈ ప‌రిస్థితుల‌ని అదునుగా చూసుకొని కశ్మీర్ లో తీవ్రవాదులు చొరబాటుకి ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో అక్క‌డి పరిస్థితుల‌పై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్య‌క్ష‌త‌న ఢిల్లీలో భేటీ ప్రారంభ‌మైంది. జాతీయ భ‌ద్ర‌తాస‌ల‌హాదారు, కేంద్ర హోంశాఖ కార్య‌ద‌ర్శి, ఐబీ డైరెక్టర్‌తో పాటు ప‌లువురు అధికారులు ఈ భేటీకి హాజ‌ర‌య్యారు. ఆ రాష్ట్రంలో మ‌ళ్లీ ప్ర‌శాంత వాతావ‌ర‌ణం తీసుకురావ‌డానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News