: ఆంధ్రా జాలర్లపై తమిళ జాలర్ల దాడి.. 18మంది కిడ్నాప్


ఆంధ్రా, తమిళనాడు జాలర్ల మధ్య మరోమారు వివాదం చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా రామతీర్థానికి చెందిన జాలర్లపై తమిళజాలర్లు దాడి చేశారు. 18 మందిని కిడ్నాప్ చేసి తమతోపాటు తీసుకెళ్లారు. దీంతో బాధిత కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. తమ వారిని క్షేమంగా విడిచిపెట్టే చర్యలు తీసుకోవాలని కోరాయి. తమిళ జాలర్ల దాడి ఇదే మొదటిసారి కాదని, వారి ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయని ఆంధ్రా జాలర్లు ఆరోపించారు. వారు తరచూ దాడులకు దిగుతుండడంతో వేటకు వెళ్లాలంటేనే భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. కాగా కిడ్నాపైన జాలర్ల ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు.

  • Loading...

More Telugu News