: పంద్రాగస్టున జాతీయ జెండాకు అవమానం... త్రివర్ణ పతాకాన్ని కాల్చేసిన దుండగులు
దేశమంతా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలం అంకోల్ సమీపంలోని బస్వాయిపల్లిలో జాతీయ పతాకానికి అవమానం జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బండారి గంగారం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం వెళ్లిపోయారు. ఆ తర్వాత కాసేపటికి అక్కడికి చేరుకున్న గుర్తు తెలియని వ్యక్తులు జెండా కర్రను పెకిలించి జెండాను తీసి నిప్పటించి పరారయ్యారు. సాయంత్రం ఈ విషయాన్ని గమనించిన సర్పంచ్ దీపిక పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు.