: మరోసారి తగ్గిన పెట్రో ధరలు.. జులై 1 నుంచి నాలుగోసారి


పెట్రోలు, డీజిల్ ధరలు మరోసారి తగ్గాయి. లీటరు పెట్రోలుపై ఒక రూపాయి, డీజిల్ పై రెండు రూపాయల చొప్పున తాజాగా తగ్గాయి. ఈ తగ్గిన ధరలు సోమవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చినట్టు ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ సంస్థ ఇండియన్ అయిల్ కార్పొరేషన్(ఐవోసీ) తెలిపింది. గత నెల 1వ తేదీ నుంచి పెట్రో ధరలు తగ్గడం ఇది నాలుగోసారి. ఈ నెల 1న పెట్రోలుపై లీటరుకు రూ.1.42, డీజిల్‌పై రూ.2.01 తగ్గింది. తాజా తగ్గింపుతో ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.61.09 నుంచి రూ.60.09కి, డీజిల్ ధర రూ.52.27 నుంచి రూ.50.27కు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గుల ఆధారంగా ప్రతి నెల 1, 16వ తేదీల్లో చమురు ధరలను ప్రభుత్వం సవరిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News