: టాక్సీ బిల్లు చూసి షాక్ తిన్న ప్రయాణికుడు... అతని సమాధానం విని షాక్ తిన్న పోలీసులు!
సుదీర్ఘ ప్రయాణం చేసిన వ్యక్తి గమ్యం చేరిన తరువాత డబ్బులు లేవని చేతులెత్తేసిన ఘటన జపాన్ లో చోటుచేసుకుంది. టోక్యోకు దక్షిణాన ఉన్న యొకహోమా నగరంలో తకఫుమి అరిమా (26) అనే వ్యక్తి నైరుతి జపాన్ లో షికొకు అనే ద్వీపంలో ఉన్న మట్సుయమ ప్రాంతానికి తీసుకెళ్లాలని ట్యాక్సీ డ్రైవర్ ను కోరాడు. గమ్యం చేరాక మీటర్ ప్రకారం చెల్లిస్తానని చెప్పడంతో ఆ ట్యాక్సీ డ్రైవర్ రాత్రంతా డ్రైవ్ చేసి 9 గంటల్లో 850 కిలో మీటర్ల దూరం తీసుకెళ్లాడు. తీరా గమ్యం చేరిన తరువాత మీటర్ చూసిన తకఫుమి అరిమా గుండె గుభిల్లుమంది. అతను ప్రయాణించిన దూరానికి అయిన మొత్తం 1.75 లక్షల రూపాయలు చెల్లించడం తన వల్ల కాదని చేతులెత్తేశాడు. దీంతో ఆ ట్యాక్సీ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతనిని అదుపులోకి తీసుకుని డబ్బులు వసూలు చేయాలని భావించిన పోలీసులకు షాక్ ఇచ్చాడు. తాను నిరుద్యోగినని, తన దగ్గర అంత మొత్తం లేదని తెలిపాడు.