: ఎట్ హోం కార్యక్రమంలో సందడి చేసిన రెండు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు


70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కేసీఆర్ పాల్గొన్నారు. స్పీకర్లు కోడెల, మధుసూధనాచారి, మండలి చైర్మన్ చక్రపాణి, వైఎస్సార్సీపీ అధినేత జగన్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అతిధులను గవర్నర్ దంపతులు ఆప్యాయంగా పలకరించారు. వీరు ఏర్పాటు చేసిన తేనీటి విందును స్వీకరించారు. విందు అనంతరం చంద్రబాబునాయుడు విజయవాడ బయల్దేరారు.

  • Loading...

More Telugu News