: కాసేపట్లో ఒకే కార్యక్రమానికి బాబు, కేసీఆర్, జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైఎస్సార్సీపీ అధినేత జగన్ కాసేపట్లో ఒకేచోటుకి రానున్నారు. ఈ ముగ్గురూ ఒకే వేదికపై కనువిందు చేయనుండడం ఆసక్తికరంగా మారింది. భారత స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మూడు రాజకీయ పార్టీల అధినేతలతో పాటు కాంగ్రెస్, బీజేపీకి చెందిన పలువురు నేతలు, రెండు రాష్ట్రాల మంత్రులు పాల్గోనున్నట్టు తెలుస్తోంది.