: వైజాగ్ కు కొన్ని పనులు చేస్తానన్నా... చేయలేదేమని అడిగే హక్కు మాత్రం ఎవరికీ లేదు!: సుబ్బరామిరెడ్డి
వైజాగ్ ప్రజలను ఓట్లడిగి 16 సంవత్సరాలైందని ఎంపీ సుబ్బరామిరెడ్డి తెలిపారు. ఓ టీవీ చానెల్ తో ఆయన మాట్లాడుతూ, వైజాగ్ ప్రజలకు మేలు కలిగే కొన్ని పనులు చేస్తానని హామీ ఇవ్వడం తన మంచితనానికి నిదర్శనమని అన్నారు. అయితే అందులో కొన్ని నెరవేరలేదని, దానిని తనను నిందించాల్సిన పని లేదని ఆయన చెప్పారు. తానుగా చేస్తానన్న పనులు ఎందుకు చేయలేదని అడిగే హక్కు ఎవరికీ లేదని ఆయన తెలిపారు. తాను ప్రజలను ఓట్లడిగి హామీలిస్తే...అప్పుడు తనను నిందించే, లేదా ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదా ఇతరులకు ఉంటుందని ఆయన తెలిపారు. రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే తనకు ఢిల్లీలో చాలా పనులు ఉంటాయని ఆయన చెప్పారు. అస్తమానం వైజాగ్ లోనే ఉండాలంటే కుదరదని ఆయన చెప్పారు.