: అఫ్జల్, కసబ్ ల ఉరికి ప్రతీకారంగానే సరబ్ జిత్ పై దాడి: బీజేపీ
పాకిస్తాన్ జైల్లో భారతీయ ఖైదీ సరబ్ జిత్ పై దాడిని బీజేపీ సీరియస్ గా తీసుకుంది. ఉగ్రవాదులు అఫ్జల్ గురు, కసబ్ లను భారత్ ఉరి తీయడంతో ప్రతీకారంగానే సరబ్ జిత్ పై దాడి జరిగిందని బీజేపీ అభిప్రాయపడింది. సరబ్ జిత్ పై దాడి జరిగి రోజులు గడుస్తున్నా కేంద్రం తగిన రీతిలో చర్యలు తీసుకోవడంలో విఫలమైందని బీజేపీ విమర్శించింది.