: పులివెందులకు కృష్ణా జలాల రాక ఖాయం!... డిసెంబర్ లోగా గడ్డం గీయిస్తానంటున్న సతీశ్ రెడ్డి!


టీడీపీ సీనియర్ నేత, ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీశ్ రెడ్డి ఇటీవల ఓ శపథం చేశారు. వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులకు టీడీపీ ప్రభుత్వం కృష్ణా జలాలను అందించి తీరుతుందని ప్రకటించిన ఆయన... పులివెందులకు కృష్ణా జలాలొచ్చేదాకా గడ్డం గీయించబోనని ప్రకటించి ఆయన పెద్ద చర్చకే తెర తీశారు. ఈ క్రమంలో నిన్న తన సొంతూరు వేంపల్లెలో ఆయనను పార్టీ అనుచరులు కలిశారు. ఈ సందర్భంగా పులివెందులకు కృష్ణా జలాల తరలింపు అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా సతీశ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివరి నాటికి పులివెందులకు కృష్ణా జలాలు తప్పకుండా వస్తాయని ఆయన పేర్కొన్నారు. పులివెందుల భూమిని కృష్ణా జలాలు ముద్దాడగానే తాను గడ్డం గీయించుకుంటానని కూడా ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News