: పంద్రాగస్టు వేడుకల ఎపెక్ట్!... ‘అనంత’కు రూ.6 వేల కోట్లతో చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ!
రాయలసీమలోని కరవు జిల్లా అనంతపురం జిల్లాలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగడం ఆ జిల్లా ప్రజలకు భారీగానే లాభించింది. రాష్ట్ర విభజన తర్వాత పారిశ్రామికంగా ఇప్పటికే పరుగు ప్రారంభించిన అనంతపురం జిల్లాకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన పంద్రాగస్టు ప్రసంగంలో భారీ ప్యాకేజీ ప్రకటించారు. ‘ఎన్టీఆర్ ఆశయం’ పేరిట ప్రకటించిన సదరు ప్యాకేజీ కింద అనంతపురం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు గాను రూ.6,554 కోట్లు కేటాయిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.