: రఘురాం రాజన్ లక్ష్యానికి ఎర్రకోటపై నుంచి నరేంద్ర మోదీ బాసట!


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా, చివరి పరపతి సమీక్షను గతవారంలో జరిపిన రఘురాం రాజన్ వెల్లడించిన ద్రవ్యోల్బణం కొత్త టార్గెట్ కు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి మద్దతు లభించింది. ఈ ఉదయం ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, వినియోగ ధరల వృద్ధి 4 శాతంగా ఉంచాలన్న ఆర్బీఐ లక్ష్యానికి తాను సమ్మతిస్తున్నానని, తమకు కావాల్సిన ఆహారం, నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు అధికంగా వెచ్చించరాదన్నదే తన అభిమతమని ఆయన న్నారు. గత ప్రభుత్వాల హయాంలో ద్రవ్యోల్బణం 10 శాతాన్ని దాటిపోయిందని గుర్తు చేసిన ఆయన, తమ ప్రభుత్వం వచ్చిన తరువాత 6 శాతానికి మించలేదని తెలిపారు. కాగా, తన పరపతి సమీక్ష అనంతరం, రాజన్ ప్రసంగిస్తూ, ఇన్ ఫ్లేషన్ టార్గెట్ 4 శాతమని, దీనికి రెండు శాతం అటూ ఇటుగా ఉన్నంత వరకూ ప్రజలకు ఇబ్బందులు రావని రాజన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News