: ఛాలెంజ్ నెరవేరలేదు.. శ్రీనగర్ విమానాశ్రయంలో జాన్విని అడ్డుకున్న భద్రతా సిబ్బంది
శ్రీనగర్‌కు గుండెకాయ లాంటి లాల్‌చౌక్‌లో మువ్వన్నెల జెండాను ఎగరేస్తానని ఛాలెంజ్ చేసిన లూధియానా అమ్మాయి జాన్వి(15) కోరిక నెరవేరలేదు. కశ్మీర్ అల్లర్ల నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున లాల్‌చౌక్‌లో జెండా ఎగరేసి తీరుతానని, తనను ఎవరు అడ్డుకుంటారో చూస్తానని జాన్వి చాలెంజ్ చేసిన సంగతి తెలిసిందే. తెల్లని చుడీదార్, మూడు రంగుల చున్నీ ధరించి మద్దతుదారులతో కలిసి ఆదివారం శ్రీనగర్ విమానాశ్రయానికి చేరుకున్న ఆమెను భద్రతాధికారులు అడ్డుకున్నారు. లోయలో కర్ఫ్యూ కొనసాగుతోందని, బయట అడుగుపెట్టే పరిస్థితులు లేవని అధికారులు ఆమెకు వివరించి వెనక్కి పంపారు. ఈ ఘటనతో తాను చాలా నిరుత్సాహానికి గురైనట్టు జాన్వి పేర్కొంది.