: ఎర్రకోటకు చేరుకున్న మోదీ... జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని


భారత 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలో వేడుకలు ప్రారంభమయ్యాయి. కొద్దిసేపటి క్రితం తన అధికారిక నివాసం నుంచి బయలుదేరిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ... రాజ్ ఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి నివాళి అర్పించిన అనంతరం ఎర్రకోటకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోట సమీపంలో కారు దిగిన మోదీ... త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరిస్తూ కోటపైకి చేరుకున్నారు. ఈ ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఇక ఈ వేడుకకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దంపతులు, కేంద్ర కేబినెట్ మంత్రులు, పలు పార్టీలకు చెందిన ఎంపీలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

  • Loading...

More Telugu News