: పరిగి పంద్రాగస్టు వేడుకల సన్నాహాల్లో అపశ్రుతి...ప్రిన్సిపల్ మృతి


రంగారెడ్డి జిల్లా పరిగి ప్రభుత్వ పాఠశాల పంద్రాగస్టు వేడుకల సన్నాహాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పాఠశాలలో విద్యార్థులతో కలిసి ప్రిన్సిపల్ పనులు పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి జాతీయ జెండా ఎగురవేసేందుకు సిద్ధం చేసిన పోల్ ను ఏర్పాటు చేసే క్రమంలో ఆయన విద్యుదాఘాతానికి గురయ్యారు. దీంతో స్కూలు ప్రిన్సిపల్ అక్కడికక్కడే మృత్యువాతపడగా, నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. దీంతో స్కూలులో విషాదం నెలకొంది.

  • Loading...

More Telugu News