: బోయిన్ పల్లిలో కారు బీభత్సం... పలువురుకి గాయాలు
హైదరాబాదులోని బోయిన్ పల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఫుట్ పాత్ ను దాటుకుని దూసుకుపోయింది. దీంతో స్థానికులు తీవ్ర భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. అయితే ఈ కారు ఓ బుక్ షాపును ఢీకొట్టి ఆగిపోవడం విశేషం. ఈ ఘటనలో పలువురు గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది.