: నా కూతురు పతకం తెస్తుందనే ఆశిస్తున్నా: దీపా కర్మాకర్ తండ్రి


రియో ఒలింపిక్స్ లో భారత్ కు స్వర్ణం లభిస్తుందా? ఈ ఒలింపిక్స్ లో ఇంకా పతకాల బోణీ చేయని భారత్, ఇప్పటికైనా ఖాతా తెరుస్తుందా? అన్న ఆసక్తి అందర్లోనూ రేగుతోంది. తొలిసారి ఒలింపిక్స్ లో పాల్గొని అద్భుత ప్రతిభ ప్రదర్శిస్తున్న దీపా కర్మాకర్ చివరి ప్రదర్శన నేడు. ఆమె పతకం సాధిస్తుందని అంతా ఆశిస్తున్నారు. ఆమె విజయం సాధించి పతకంతో స్వదేశం చేరాలని ఆమె సొంత రాష్ట్రం త్రిపురలో అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తండ్రి దులాల్ కర్మాకర్ మాట్లాడుతూ, దేశమంతా ఆమెకు అండగా ఉంది, ఆమె గెలవాలని పూజలు కూడా చేస్తున్నారన్నారు. తన కుమార్తె మెరుగైన ప్రదర్శనతో పతకం తెస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అందరి ఆశీస్సులతో పతకంతో తిరిగి స్వదేశం చేరుతుందని ఆశిస్తున్నానని ఆయన తెలిపారు. కాగా, దీపాకు ప్రధానంగా అమెరికా జిమ్నాస్ట్ బైల్స్ తో పోటీ పడుతుంది.

  • Loading...

More Telugu News