: కొరటాల శివ హీరోని క్లాసీగా చూపిస్తారు... ఎన్టీఆర్ అదుర్స్: వరుణ్ తేజ్


దర్శకుడు కొరటాల శివ తన చిత్రాలలో హీరో పాత్రను చాలా క్లాసీగా చూపిస్తారని మెగా ఫ్యామిలీ హీరో వరుణ్‌ తేజ్‌ ట్విట్టర్ లో తెలిపాడు. జూనియర్ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘జనతా గ్యారేజ్‌’ చిత్రం ట్రైలర్‌ చూసిన అనంతరం ట్విట్టర్ ద్వారా స్పందించిన వరుణ్ తేజ్...'ఇప్పుడే జనతా గ్యారేజ్‌ ట్రైలర్‌ చూశాను. అద్భుతమైన కట్‌! కొరటాల శివగారు... హీరో క్యారెక్టరైజేషన్‌ ను ఎప్పుడూ క్లాసీగా తీస్తారు. ఎన్టీఆర్‌ ఎప్పటిలాగే చక్కగా చేశారు' అని అభినందించాడు. సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో ఇతర ప్రముఖ పాత్రల్లో మోహన్ లాల్, సాయికుమార్, సమంత, నిత్యా మీనన్‌ నటిస్తుండగా, దీనికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News