: 11 రోజుల అనంతరం ఇంటికి వెళ్లిన సోనియా గాంధీ!


వారణాసిలో జరుగుతున్న కాంగ్రెస్ ర్యాలీ సందర్భంగా తీవ్ర అస్వస్థతకు గురై, 11 రోజులుగా న్యూఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కొద్దిసేపటి క్రితం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి, 10 జన్ పథ్ లోని తన ఇంటికి చేరారు. ఎడమ భుజానికి జరిగిన శస్త్రచికిత్స నుంచి, వైరల్ ఫీవర్ నుంచి సోనియా పూర్తిగా కోలుకున్నారని ఆసుపత్రి మేనేజ్ మెంట్ బోర్డు చైర్మన్ డాక్టర్ డీఎస్ రాణా తెలిపారు. కాగా, తొలుత ఆర్మీ ఆసుపత్రిలో చేర్చినా, ఆపై సోనియాకు దీర్ఘకాలంగా వైద్యం అందిస్తున్న సర్ గంగారాం ఆసుపత్రికి ఆమెను తరలించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News