: విజయవాడకు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్... చంద్రబాబుకు కితాబు!
కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ ఉదయం విజయవాడకు వచ్చారు. కృష్ణా పుష్కరాల్లో స్నానం చేసేందుకు వచ్చిన ఆయనకు మంత్రులు గంటా శ్రీనివాస్, నారాయణ, పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ తో పాటు పలువురు తెలుగుదేశం, బీజేపీ నేతలు స్వాగతం పలికి, ఆయనతో పాటు పున్నమి ఘాట్ కు వచ్చి పుష్కర స్నానం చేశారు. ఈ సందర్భంగా జవదేకర్ మాట్లాడారు. పుష్కరాల కోసం చంద్రబాబు పడిన కష్టం ఏమిటనేది ఇక్కడి ఏర్పాట్లను, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న ప్రజలను చూస్తుంటే తెలుస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాలను విజయవంతం చేసేందుకు ఎంతో ముందు నుంచే పక్కా ప్రణాళికను రూపొందించి వాటిని అమలు పరచడంలో విజయం సాధించిందని కితాబిచ్చారు. విద్యార్థినీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాల్సి వుందని చెప్పారు. పుణ్యస్నానం అనంతరం, కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు జవదేకర్ వెళ్లారు.