: గుడిలో పురుగుల మందు తాగి ఓ కుటుంబం ఆత్మహత్య... కర్నూలు జిల్లాలో కలకలం!
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు ఓ గుడిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్నూలు జిల్లాలో కలకలం సృష్టించింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, జిల్లాలోని నంద్యాల, ధర్మశాల ప్రాంతం వాసి రాంప్రసాద్ కుటుంబం గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. వీరంతా ఇక్కడి నంది ఆలయానికి వచ్చి, పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనలో రాంప్రసాద్ తో పాటు ఆయన భార్య సత్యవతి, విజయ్ కుమార్, శోభారాణిలు అక్కడికక్కడే మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.