: ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద... పుష్కర భక్తులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక!
ఎగువన ఉన్న నాగార్జున సాగర్ టెయిల్ పాండ్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి విడుదల చేస్తున్న నీటితో ప్రకాశం బ్యారేజికి వరదనీరు పోటెత్తుతోంది. ప్రస్తుతం 12 అడుగుల మేరకు నీరుండగా, 8,800 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఈ నీటిలో 3,400 క్యూసెక్కులను కృష్ణా డెల్టాకు, 5,400 క్యూసెక్కుల నీటిని పశ్చిమ డెల్టాకు విడుదల చేస్తున్నారు. కాగా, వరద నీరు వస్తున్న కారణంగా పుష్కర యాత్రికులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు. జనాల రద్దీ తక్కువగా ఉంటే, సీతానగరం ప్రాంతం నుంచి విజయవాడకు మినీ బస్సులను నడిపిస్తామని, ఇతర వాహనాలకూ అనుమతిస్తామని అధికారులు పేర్కొన్నారు.