: రియోలో ఓడిన సానియా - బోపన్న జోడి


రియో ఒలింపిక్స్ లో సానియా మీర్జా తన సత్తా చాటి, మిక్సెడ్ డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్నతో కలసి స్వర్ణ పతకం తెస్తుందన్న 130 కోట్ల మంది ఆశలు గల్లంతయ్యాయి. రాత్రి జరిగిన మ్యాచ్ లో వీనస్ విలియమ్స్, రాజీవ్ రామ్ జోడీతో జరిగిన సెమీ ఫైనల్ పోరులో సానియా జోడీ 6-2, 2-6, 3-10 తేడాతో ఓడిపోయింది. ఇక కాంస్య పతకం కోసం సానియా - బోపన్న జోడీ మరో మ్యాచ్ ని నేడు ఆడనుంది. తొలి సెట్ ను సానియా జోడీ గెలుచుకున్నప్పటికీ, ఆపై రెండో సెట్ లో చేతులెత్తేసి, నిర్ణయాత్మకమైన మూడో సెట్ లోనూ అదే తరహా ఆటతీరును కనబరిచి, ప్రేక్షకులకు నిరాశను మిగిల్చింది.

  • Loading...

More Telugu News