: పుష్కరానికి కదిలిన రజనీకాంత్... గుంటూరు జిల్లా అచ్చంపేట 'విష్ణు పంచాయతన' దివ్య క్షేత్రానికి సూపర్ స్టార్


సూపర్ స్టార్ రజనీకాంత్, కృష్ణా పుష్కరాల సందర్భంగా పుణ్య నదిలో స్నానం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఎక్కడికి రానున్నారో తెలుసా? భక్తుల రద్దీ అధికంగా ఉంటూ, వీఐపీలు వెల్లువలా వచ్చే విజయవాడకో లేదా శ్రీశైలానికో కాదు. పెద్దగా పేరులేని గుంటూరు జిల్లా అచ్చంపేటకు. అచ్చంపేట మండలంలోని చింతపల్లిలో చాలా మందికి తెలీని ఓ దివ్యక్షేత్రం ఉంది. అదే విష్ణు పంచాయతన దివ్య మహా పుణ్య క్షేత్రం. రజనీకాంత్ ఈ క్షేత్రానికే రానున్నాడు. ఈ మేరకు ఆలయ కమిటీకి వర్తమానం కూడా అందింది. రజనీ రాకతో ఈ క్షేత్రానికి మరింత పేరు వస్తుందని ఆశిస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News