: తిరంగా యాత్ర నెల రోజుల పాటు జరుగుతుంది: దత్తాత్రేయ
స్వాతంత్ర్య దినోత్సవం నుంచి వచ్చే నెల 17వ తేదీ వరకు తిరంగా యాత్ర జరుగుతుందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. బర్కత్ పురాలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ప్రజల్లో దేశభక్తి, జాతీయతా భావాన్ని పెంపొందించడంతో పాటు యువతీ యువకులను అధిక సంఖ్యలో తిరంగా యాత్రలో పాల్గొనేలా చేయడమే తమ ముందున్న లక్ష్యమని తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులతో ఈ తిరంగా యాత్రను హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో నిర్వహించనున్నారని చెప్పారు. ఈ సందర్భంగా యువతీ యువకులంతా ద్విచక్రవాహనాలపై జాతీయ జెండాలను పట్టుకుని ర్యాలీలో పాల్గొంటారని ఆయన తెలిపారు.