: కేరళలో ముస్లిం లీగ్ కార్యకర్త హత్య.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
కేరళలో ముస్లింలీగ్ కార్యకర్త మహ్మద్ అస్లాంను దుండగులు హత్యచేశారు. ఇతను కోజికోడ్ జిల్లాలోని నడపురానికి చెందిన వ్యక్తి. పాత కక్షల కారణంగానే ఆయనను హత్య చేసినట్లు తెలుస్తోంది. మహ్మద్ అస్లాం హత్యతో కేరళవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసు అధికారులు కేరళలోని ఏడు ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించి, భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మహ్మద్ అస్లాం హత్యకు సీపీఎం కార్యకర్తలు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. హత్యకేసులో పోలీసులు ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. గత ఏడాది జనవరిలో జరిగిన డీవైఎఫ్ఐ కార్యకర్త శిబిన్ భాస్కరన్ హత్య కేసులో అస్లాం నిందితుడు. విచారణ అనంతరం న్యాయస్థానం జూన్ 15న ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది.