: అబిడ్స్‌లో 300 మంది పోలీసులతో కార్డన్‌సెర్చ్
హైదరాబాద్ అబిడ్స్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు కార్డన్‌సెర్చ్(ముట్టడి- తనిఖీలు) చేపట్టారు. డీసీపీ కమలాసన్‌రెడ్డి, ఏసీపీ రాఘవేంద్రరెడ్డి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. కార్డెన్‌సెర్చ్‌లో 10 మంది సీఐలు, 300 మంది పోలీసులు పాల్గొంటున్నారు. ప్రతి ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహనాలు, వ్యక్తులకు సంబంధించిన పత్రాలు, అనుమానాస్పదంగా కనిపిస్తోన్న వ్యక్తుల వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.