: సహచర మంత్రులతో కలసి పుష్కర హారతికి హాజరైన చంద్రబాబు


కృష్ణా పుష్కరాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి రోజూ పాలుపంచుకుంటున్నారు. పవిత్ర సంగమం వద్ద నిర్వహిస్తున్న పుష్కర హారతిలో పాల్గొనేందుకు సహచర మంత్రులతో కలిసి ఆయన ప్రతి రోజూ ముహూర్త సమయానికి చేరుకుంటున్నారు. నేడు దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఇతర నేతలతో కలిసి కృష్ణా పుష్కర హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితో పాటు భక్తులు కూడా భారీ సంఖ్యలో పుష్కర హారతి కార్యక్రమంలో భక్తిప్రపత్తులతో పాలుపంచుకున్నారు.

  • Loading...

More Telugu News