: కొచ్చిలో 3 కోట్ల 20 లక్షల రూపాయల విలువచేసే వజ్రాలు, ఆభరణాలు పట్టివేత
కేరళలోని కొచ్చిలో ఇద్దరు ప్రయాణికుల నుంచి ఈరోజు అధికారులు భారీగా వజ్రాలు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వారు ముంబయి నుంచి కొచ్చికి వచ్చిన ప్రయాణికులుగా గుర్తించారు. ఎర్నాకుళమ్ కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్, సిఐఏఎల్ కస్టమ్స్ విభాగం, ఇంటెలిజెన్స్ అధికారులు కలిసి చేసిన తనిఖీల్లో వారు పట్టుబడ్డట్లు తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న వజ్రాలు, బంగారు ఆభరణాలు 3 కోట్ల 20 లక్షల రూపాయల విలువ చేస్తాయని అధికారులు పేర్కొన్నారు. సదరు వ్యక్తులు ఆభరణాలను అక్రమంగా తరలిస్తున్నారని చెప్పారు. ఆభరణాలను ఎక్కడినుంచి తెచ్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.