: యాదగిరిపై కాల్పులు జరిపింది డక్కల బాబు... భూ వివాదమే కారణం!
సికింద్రాబాదు పరిధిలోని బోయిన్ పల్లిలో నేటి మధ్యాహ్నం చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో దోషిని పోలీసులు గుర్తించారు. పాత బోయిన్ పల్లిలోని మల్లికార్జుననగర్ లో బైక్ పై వచ్చిన దుండగుడిని డక్కల బాబుగా గుర్తించారు. కాంగ్రెస్ పార్టీ నేత యాదగిరితో ఇతనికి భూవివాదం ఉన్నట్టు గుర్తించారు. ఆల్వాల్ లో 4 ఎకరాల భూమి విషయంలో వీరిద్దరి మధ్య వివాదం కొనసాగుతోందని, ఈ నేపథ్యంలోనే యాదగరిని హతమార్చాలన్న లక్ష్యంతో డక్కల బాబు కాల్పులు జరిపాడని, యాదగిరి సాహసం, సకాలంలో వైద్యసహాయం అందడంతో అతనికి ప్రాణాపాయం తప్పిందని పోలీసులు తెలిపారు. కాగా, దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న డక్కల బాబును అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చేపట్టారు. ఇతనిపై ఇప్పటికే సికింద్రాబాద్ పరిసర పోలీస్ స్టేషన్లలో పలు కేసులున్నాయని వారు తెలిపారు.