: ఆజంఖాన్ పై సుప్రీంకోర్టులో కేసు వేసిన బులంద్ షహర్ గ్యాంగ్ రేప్ బాధిత బాలిక


ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ పై బులంద్ షహర్ గ్యాంగ్ రేప్ బాధిత బాలిక సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది. అత్యాచార ఘటనపై ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆమె ఈ కేసు వేసింది. నోయిడా నుంచి స్వగ్రామానికి కారులో వెళ్తున్న కుటుంబాన్ని అడ్డుకుని, పురుషులను కొట్టి, కట్టేసి తల్లీకూతుళ్లపై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం బాధిత కుటుంబాన్ని బీజేపీ నేతలు పరామర్శించిన సందర్భంగా ఇది ప్రతిపక్షాల కుట్రలా కనిపిస్తోందని ఆజంఖాన్ ఆరోపించారు. దీనిపై బీజేపీ మరింత ఘాటుగా స్పందించి, అతని కుటుంబంలో ఈ ఘటన జరిగి ఉంటే వారి బాధ అర్థమయ్యేదని సమాధానం చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆజంఖాన్ వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని బాధిత బాలిక సుప్రీంకోర్టును కోరింది.

  • Loading...

More Telugu News