: ఏడు నెలల చిన్నారిని కారులోనే వదిలివెళ్లిన తండ్రి.. ప్రాణాలు కోల్పోయిన చిన్నారి


తండ్రి నిర్లక్ష్యానికి అభంశుభం తెలియని చిన్నారి బలైన సంఘటన అమెరికాలోని టెక్సాస్ లో చోటుచేసుకుంది. అక్కడి శాన్ అంటోరియాలోని వాల్ మార్ట్ పార్కింగ్ ప్రాంతంలో ఓ ఏడు నెల‌ల చిన్నారిని తండ్రి కారులో నిర్ల‌క్ష్యంగా వ‌దిలేశాడు. దీంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. హెలోటెస్ సబర్బన్ లోని స్టోర్‌లో ప‌నిచేస్తోన్న తండ్రి తన కొడుకును డే కేర్ సెంటర్ లో వదిలిపెట్టడం మర్చిపోయి, కారులోనే వ‌దిలేసి త‌న ప‌ని చూసుకోవ‌డానికి వెళ్లిపోవడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడ‌ని అమెరికా మీడియా పేర్కొంది. ఉదయం 6.15 గంటలకు కారును వ‌దిలి వెళ్లిన తండ్రి మ‌ధ్యాహ్నం 3 గంటలకు మ‌ళ్లీ త‌న కారు వ‌ద్ద‌కు వ‌చ్చాడు. కారులో స్పృహ లేకుండా పడివున్న కొడుకును చూసి ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌గా వైద్యులు ఆ చిన్నారి మృతి చెందాడ‌ని చెప్పారు. త‌ల్లిదండ్రుల నిర్లక్ష్యంతో అమెరికాలో కార్లలో ఈ ఏడాది ఇప్పటివరకు 27 మంది చిన్నారులు ఈ విధంగా ప్రాణాలు కోల్పోయారు.

  • Loading...

More Telugu News