: దుండగులను బెంబేలిత్తించిన యాదగిరి!... తుపాకీ లాక్కుని పోలీసులకిచ్చాడట!


ఆసుపత్రి వద్ద ఆదమరచి ఉన్న కాంగ్రెస్ నేత యాదగిరిని సులువుగానే హత్య చేయొచ్చని దుండుగులు వేసిన ప్లాన్ పారలేదు. బోయిన్ పల్లిలోని మల్లికార్జున నగర్ లో బైక్ వచ్చిన ఇద్దరు దుండగులు తనపై దాడికి దిగగా, యాదగిరి ఏమాత్రం అదిరిపోలేదు. దుండగుల తుపాకీ నుంచి దూసుకువచ్చిన ఓ బుల్లెట్ ఛాతీలోకి వెళ్లగా, మరో బుల్లెట్ తొడ భాగంలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో రక్తమోడుతున్న స్థితిలోనే ఆయన దుండగులపైకి లంఘించి వారి చేతిలోని తుపాకీని లాగేసుకున్నాడు. యాదగిరి ధైర్యంతో బెంబేలెత్తిపోయిన దుండగులు అక్కడి నుంచి పరారు కాగా... వారి చేతిలోని తుపాకీని యాదగిరి పోలీసులకు అప్పగించాడు. ఈ విషయాలను డీసీపీ సుమతి కొద్దిసేపటి క్రితం మీడియాకు వెల్లడించారు. బుల్లెట్ గాయాలైన యాదగిరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ప్రాణాపాయం నుంచి ఆయన బయటపడినట్లు వైద్యులు తెలిపారని ఆమె చెప్పారు.

  • Loading...

More Telugu News