: బోయిన్ పల్లి కాల్పుల్లో కాంగ్రెస్ నేత పరిస్థితి విషమం!... భూతగాదాలే కారణమంటున్న పోలీసులు!
సికింద్రాబాదు పరిధిలోని బోయిన్ పల్లిలో కొద్దిసేపటి క్రితం చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో కాంగ్రెస్ పార్టీ నేత యాదగిరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాల్పుల తర్వాత వెనువెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స ప్రారంభించిన కాసేపటికే ఆయన చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆయన చికిత్సకు స్పందిస్తున్నట్లు, పరిస్థితి మాత్రం విషమంగా వున్నట్టు తాజా సమాచారం. మల్లికార్జున నగర్ లోని ఓ ఆసుపత్రి సమీపంలో నిలబడ్డ యాదగిరిని లక్ష్యంగా చేసుకుని బైక్ పై వచ్చిన దుండగులు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో తీవ్ర గాయాలపాలైన యాదగిరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. భూ తగాదాల కారణంగా ఈ కాల్పులు జరిగి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.