: గోయల్ కేంద్ర మంత్రే!... అయితే రియోలో ఆయన ఎవరికి తెలుసు?: ధన్ రాజ్ పిళ్లై ఘాటు వ్యాఖ్యలు
తన అనుచర గణంతో కలసి రియో ఒలింపిక్స్ లో హల్ చల్ చేయబోయిన కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ పై అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చిన గోయల్... తానేమీ తప్పు చేయలేదని, పొరపాటేదైనా జరిగి ఉంటే చింతిస్తున్నానని ప్రకటించారు. దీనిపై భారత హాకీ మాజీ ఆటగాడు ధన్ రాజ్ పిళ్లై ఘాటుగా స్పందించారు. ‘‘విజయ్ గోయల్ కేంద్ర మంత్రి కావచ్చు. భారత్ లో ఆయనకు గౌరవ మర్యాదలు దక్కవచ్చు. అయితే రియోలో ఆయన ఎవరికి తెలుసు?’’ అంటూ పిళ్లై వ్యాఖ్యానించారు.