: నయీమ్ కేసులో ఆరోపణల ఖండనకు మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి ప్రెస్ మీట్... అంతలోనే రద్దు!


మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి తన మీడియా సమావేశాన్ని రద్దు చేశారు. సాంకేతిక కారణాల వల్ల మీడియా సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు దినేశ్ రెడ్డి మీడియాకు సమాచారం పంపారు. కాగా, అంతకుముందు, గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసులో ఆరోపణలపై స్పందించేందుకు దినేశ్ రెడ్డి పీసీ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నామని, బీజేపీ రాష్ట్ర ఆఫీసుకు రావాలని మీడియాకు సమాచారం పంపారు. అయితే, దీనిపై స్పందించిన బీజేపీ, ప్రెస్ మీట్ అవసరం లేదని దినేశ్ రెడ్డికి సలహా ఇచ్చింది. నయీమ్ కేసులో నేరుగా తన పేరు రాకుండానే స్పందించడం ఎందుకంటూ దినేశ్ రెడ్డిని బీజేపీ ప్రశ్నించినట్లు సమాచారం. మీడియాకు సమాచారం పంపినందువల్లే తాను మాట్లాడుతున్నానని దినేశ్ రెడ్డి సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News