: నిండుకుండలా జూరాల!... తరలివచ్చిన వరద వచ్చినట్లే కిందకు!


కృష్ణా నదిపై తెలంగాణలోని ముఖ్యమైన జలాశయం ప్రియదర్శిని జూరాల... నిండుకుండను తలపిస్తోంది. ఎగువ రాష్ట్రాల్లో భారీ వరదల కారణంగా ఇప్పటికే పూర్తి స్థాయిలో నిండిన ఈ జలాశయానికి ఇంకా వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం జలాశయంలో నీటి మట్టం 318.35 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండిన నేపథ్యంలో వచ్చిన నీటిని వచ్చినట్టే అధికారులు కిందకు వదులుతున్నారు. ప్రస్తుం ప్రాజెక్టులోకి 1.5 లక్షల క్యూసెక్కుల మేర నీరు వస్తుండగా, అంతే మొత్తంలో నీటిని కిందకు వదులుతున్నారు. ఇందుకోసం ప్రాజెక్టులోని ఏడు గేట్లను ఎత్తివేశారు.

  • Loading...

More Telugu News