: ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన అమెరికా స్విమ్మర్
రియో ఒలింపిక్స్ లో మహిళల 800 మీటర్ల ఫ్రీ స్టైల్ లో అమెరికా స్విమ్మర్ కెటీ లెడెకీ ప్రపంచ రికార్డుతో పాటు, ఒలింపిక్ రికార్డును బద్దలు కొట్టింది. 8.04.79 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని గత రికార్డును బద్దలు కొట్టింది. గత రికార్డుకు, ప్రస్తుత రికార్డుకు మధ్య రెండు సెకన్లకు పైగా తేడా ఉంది. అధిక స్వర్ణ పతకాలు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్న అమెరికా మేల్ స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ సరసన లెడెకీ కూడా నిలవడం గమనార్హం. కాగా, ద్వితీయ, తృతీయ స్థానాల్లో వరుసగా బ్రిటన్ కు చెందిన జార్జ్ కార్లిన్, హంగేరియన్ స్విమ్మర్ కాపస్ బొగ్లర్క నిలిచారు.