: పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం జమ్మూకాశ్మీర్ లో భాగమే: ప్రధాని మోదీ
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) జమ్మూకాశ్మీర్ లో భాగమేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కాశ్మీర్ అంశంపై ప్రధాని మోదీ అధ్యక్షతన ఈరోజు అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. జమ్మూకాశ్మీర్ ప్రజల భద్రత విషయంలో ఎలాంటి రాజీపడే ప్రసక్తే లేదని, త్వరలోనే ఈ అంశంపై కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు. కాశ్మీర్ అల్లర్లకు పాక్ మద్దతు ఇచ్చే సీమాంతర ఉగ్రవాదమే కారణమని మోదీ అన్నారు. సుమారు నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, సుజనా చౌదరి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.