: ప్రారంభమైన 'జనతా గ్యారేజ్' ఆడియో వేడుక
వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం 'జనతా గ్యారేజ్' ఆడియో వేడుక ప్రారంభమైంది. హైదరాబాదులోని శిల్పకళా వేదికలో 'జనతా గ్యారేజ్' ఆడియో వేడుక జరుగుతోంది. ఈ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఆ సినిమాలో నటిస్తున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, ఇతర నటీనటులు కూడా పాల్గొంటున్నారు. ఈ సినిమాను ఒకేసారి తెలుగు, మలయాళ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా, దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టే యూనిట్ కూడా విజయంపై విశ్వాసం వ్యక్తం చేస్తోంది.