: డికాప్రియోను ఒప్పించడం అంత సులభం కాదు: హాలీవుడ్ దర్శకుడు


ఆస్కార్ విజేత, ప్రముఖ హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియోను ఒప్పించడం అంత తేలిక కాదని ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు బజ్ లార్మన్ అన్నారు. లియోనార్డో డికాప్రియాతో 1996లో 'రోమియో జూలియట్', 2013లో 'ది గ్రేట్ గ్యాట్స్ బై' సినిమాలకు దర్శకత్వం వహించిన లార్మన్ మాట్లాడుతూ, డికాప్రియో చాలా జాగ్రత్తగా సినిమాలు ఎంపిక చేసుకుంటాడని అన్నాడు. ప్రకృతి ప్రేమికుడు కావడంతో డికాప్రియో పర్యావరణానికి ఇబ్బంది కలిగించే అంశాలున్న కథలను ఓకే చేయడని చెప్పాడు. ఈ లక్షణం హాలీవుడ్ లో డికాప్రియోకు మాత్రమే ఉందని కొనియాడాడు. కథ విన్న తరువాత నిర్ణయం తేలిగ్గా తీసుకోడని, బాగా ఆలోచించి, అందరికీ మంచి జరుగుతుంది అనుకుంటేనే అంగీకరిస్తాడని తెలిపాడు. తమ ఇద్దరి ఆలోచనలు దగ్గరగా ఉంటాయని, అతనితో ఎన్నిసార్లయినా సినిమా తీసేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News