: గుంటూరు జిల్లాలో విషాదం.. నీటికుంట ఊబిలో కూరుకుపోయి నలుగురు స్కూల్ విద్యార్థుల మృతి
గుంటూరు శివారులోని ఓబులునాయుడు పాలెంలో ఈరోజు తీవ్ర విషాదం నెలకొంది. నీటికుంటలో పడి నలుగురు తొమ్మిదో తరగతి విద్యార్థులు మృతి చెందారు. మృతి చెందిన విద్యార్థులు అభిషేక్, రమేష్, గోపి, సాయితేజలుగా పోలీసులు గుర్తించారు. చౌడారంలోని బ్రిలియంట్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఎనిమిది మంది ఈరోజు క్రికెట్ ఆడిన తరువాత అక్కడి నీటికుంటలో ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో అందులోకి దిగిన నలుగురు పిల్లలు నీటికుంట ఊబిలో కూరుకుపోయి చనిపోయారు. విద్యార్థుల మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.